News February 12, 2025
శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350313921_1212-normal-WIFI.webp)
శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 12, 2025
సిద్దిపేట: త్వరలో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365823554_60469957-normal-WIFI.webp)
కుకునూరుపల్లి హనుమాన్ నగర్‌కి చెందిన గడ్డం గణేశ్(22) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గణేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఫోన్ మాట్లాడివస్తానని ఇంటి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
News February 12, 2025
APPLY NOW.. నెలకు రూ.3000
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739054912247_893-normal-WIFI.webp)
చిన్న, సన్న కారు రైతులను ఆర్థికంగా ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3000 పెన్షన్ ఇస్తారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. ఒక వేళ రైతు చనిపోతే అతని భార్యకు నెలకు రూ.1500 పెన్షన్ ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
News February 12, 2025
NRPT: స్థానిక ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363201735_51550452-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నారాయణపేట పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధన పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.