News December 30, 2024
శావల్యాపురం: సైబర్ నేరగాళ్ల వలలో మండల నివాసి
శావల్యాపురం(M) కారుమంచికి చెందిన నరసింహారావు ఖాతాలోని నగదు మాయంపై ఫిర్యాదు అందినట్లు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. నరసింహరావు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిర్వహించుకొని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సైబర్ నేరగాడు నరసింహరావుకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ డబ్బులు ఖాతాలో పడతాయని, మీకు వచ్చిన లింక్ ఓపెన్ చేయమన్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో డబ్బులు మాయయ్యాయి.
Similar News
News January 4, 2025
RRRపై హత్యాయత్నం.. గుంటూరు జీజీహెచ్ రిటైర్డ్ డాక్టర్ హస్తం
RRRను గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టిన విషయం విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డా. నీలం ప్రభావతి హస్తం ఉందని RRR తరఫున లాయర్ హైకోర్టులో వినిపించారు. రఘురామపై దాడి చేసిన పోలీసులను కాపాడేందుకు, కస్టడీలో RRR ఆరోగ్యం బాగానే ఉందని రికార్డులు తారుమారు చేశారని లాయర్ పోసాని అన్నారు.
News January 4, 2025
పల్నాడు జిల్లాలో ఎయిర్ పోర్టుపై CM కీలక ప్రకటన
పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు నాగార్జున సాగర్లో 1670 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
News January 4, 2025
నేడు గుంటూరులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
గుంటూరు పాతబస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి ప్రదర్శన ప్రారంభం అవుతుందని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రదర్శనకు తీసుకు రావాలని కోరారు.