News November 12, 2024

శాసనసభ విప్‌గా కురుపాం ఎమ్మెల్యే 

image

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అసెంబ్లీ విప్‌గా నియమితులయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను శాసనసభ విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో జగదీశ్వరీకే విప్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కూటమి శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 14, 2024

VZM: స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌‌ల నియామకం 

image

జిల్లా జ్యుడీషియల్ పరిధిలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. బార్‌లో నాన్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా ఉంటూ 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వారంలో ఐదు రోజులపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.

News November 14, 2024

MLC ఎన్నిక ప్రక్రియ రద్దుపై కలెక్టర్ ప్రకటన

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ ర‌ద్దు చేసిన‌ట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉప ఎన్నిక‌కు ఈ నెల 4వ తేదీన నోటిఫికేష‌న్ వెలువ‌డింద‌ని వెల్లడించారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ర‌ఘురాజు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేష‌న్ ర‌ద్దు చేస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని తెలిపారు. 

News November 14, 2024

ప్యానల్ స్పీకర్ల జాబితాలో ఎస్.కోట MLA

image

అసెంబ్లీలో కోళ్ల లలిత కుమారీకి కీలక పదవి దక్కింది. పలువురు ఎమ్మెల్యేలను ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈ జాబితాలో ఎస్.కోట ఎమ్మెల్యే ఉన్నారు. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. కోళ్ల లలిత కుమారీ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. కాగా కోళ్ల లలిత కుమారి మూడో సారి టీడీపీ నుంచి ఎస్.కోట ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు.