News January 9, 2025
శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు
మాదాపూర్‌లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.
Similar News
News January 10, 2025
సికింద్రాబాద్: సంక్రాంతి ఫెస్టివల్.. స్పెషల్ క్యాంపెయిన్
సంక్రాంతి ఫెస్టివల్ పురస్కరించుకొని సికింద్రాబాద్ జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. 3 రోజులపాటు జరగనున్న ‘యువర్ టైం ఆన్ మై మెట్రో’ ప్రోగ్రాంలో సంక్రాంతి వేడుకలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన రైలుకు పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర సాంస్కృతి, కళలు కంటి ముందు కనపడేలా మెట్రో క్యాంపెయిన్ జరుగునుంది.
News January 10, 2025
ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.
News January 10, 2025
RR: రూ.4000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్లు
HYDలో రూ.3619 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్లు, రూ.1487 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.1,900 కోట్ల భూసేకరణ పరిహారానికి వెచ్చించనున్నారు. మరోవైపు రూ.4,000 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు సంబంధించిన భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి సర్వే ప్రకారం పూర్తి చేశారు.