News February 2, 2025
శొంఠ్యాం హైవేపై యాక్సిడెంట్.. ఒకరు మృతి
ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వస్తున్న బైక్ లారీని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 2, 2025
వాల్తేర్ డివిజన్‌కు విశిష్ట రైలు సేవా పురస్కారం
భువనేశ్వర్‌లో జరుగుతున్న రైల్వే 69వ వార్షికోత్సవాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు విశిష్ట రైలు సేవా పురస్కారం లభించింది. ఈమేరకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ ఈ అవార్డును అందించారు. ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలకు వాల్తేర్ డివిజన్‌కు మరో ఆరు ప్రత్యేక పురస్కారాలు దక్కాయి. అత్యుత్తమ పని తీరు కనబర్చిన 49 మంది సిబ్బందికి పురస్కారాలు అందించారు.
News February 2, 2025
గాజువాకలో యువకుడి సూసైడ్
గాజువాకలో విజయనగరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మాసిటీలో పనిచేస్తున్న భాస్కరరావు శ్రీనగర్లో అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బందువులు దాడి చేసి ఇంట్లో బంధించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాజువాక పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
News February 2, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిందితుడు అరెస్ట్
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్‌లో శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ బెట్టింగ్ ద్వారా 178 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.