News June 20, 2024

శ్రీ మఠంలో సినీ నిర్మాత రాచాల యుగంధర్ గౌడ్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ నిర్మాత యుగంధర్ గౌడ్ తన సహచరులతో కలిసి దర్శించుకున్నారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమన్ తేజ, గరీమ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా నిర్మించిన ‘సీతా కళ్యాణ వైభోగమే’ చిత్రం శుక్రవారం విడుదల కానుందని, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు.

Similar News

News October 4, 2024

పెన్షన్ పంపిణీలో జిల్లా అగ్రస్థానం: కలెక్టర్

image

కర్నూలు జిల్లా పెన్షన్ పంపిణీలో 3 నెలలు వరుసగా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు పెన్షన్ పంపిణీ అధికారులకు అభినందనలు తెలిపారు. శుక్రవారం 15 మంది అధికారులను ఆయన ఘనంగా సన్మానించారు. పెన్షన్ పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో చేరేలా కృషిచేసిన డీఆర్డీఏ పీడీ సలీం బాషాను సత్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News October 4, 2024

బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం బన్నీ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.

News October 4, 2024

Way2News వార్తకు స్పందించిన పోలీసులు.. బాలుడు లభ్యం

image

గోనెగండ్ల పరిధిలోని చిన్నమరివీడుకు చెందిన వర్ధన్ నాయుడు భారతీ దంపతుల కుమారుడు సూర్యతేజ(14) నిన్నటి రోజు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని తల్లి భారతి రోధించిన తీరును Way2News ప్రచురించింది. సీఐ గంగాధర్ స్పందించి ఏఎస్ఐ తిమ్మారెడ్డిని ఆదేశించడంతో.. బాలుని ఆచూకీ కోసం కర్నూలులో గాలించారు. పాత బస్టాండ్‌లో ఆచూకీ లభించింది. దీంతో Way2Newsకు, పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.