News February 8, 2025

శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ రౌండప్

image

☞ 11 నుంచి అంగన్వాడీల పోస్టుల భర్తీకి ముఖాముఖి
☞ నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
☞ రూ.200కోట్ల అభివృద్ధి పనులపై హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ తొలి సంతకం
☞ సోమందేపల్లి: కేతగానిచెరువులో వివాహిత ఆత్మహత్య
☞ నల్లమాడ, ఓడీచెరువులో గొలుసు చోరీ దొంగ అరెస్ట్
☞ 10న మడకశిరలో కలెక్టర్ ప్రజా వేదిక
☞ ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘా పెట్టండి: ఎస్పీ రత్న
☞ ధర్మవరం జాబ్ మేళాలో 52 మందికి ఉద్యోగాలు

Similar News

News February 8, 2025

బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి 

image

బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.

News February 8, 2025

RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

News February 8, 2025

నిజామాబాద్: రేటు రాక పసుపు రైతుల్లో ఆందోళన

image

నిజామాబాద్ మార్కెట్లో కొన్ని రోజులుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధర మాత్రం గతేడాది కంటే తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్లో మొదట 13 వేలకు క్వింటాలు ఉండగా ప్రస్తుత సీజన్లో అది 11 వేలకు పడిపోయింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గడం మరో వైపు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

error: Content is protected !!