News March 25, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: రేపు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని షాదీ మహల్‌లో జరిగే ఇఫ్తార్ వేడుకలకు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పార్లమెంటు సభ్యులు హాజరవుతారన్నారు.
Similar News
News December 23, 2025
నేడు విశాఖలో రెండో టీ20

ఉమెన్స్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇవాళ విశాఖలో రెండో T20 జరగనుంది. తొలి మ్యాచ్ IND గెలిచినప్పటికీ 5 క్యాచులు వదిలేసింది. దీంతో నేటి మ్యాచ్‌లో మెరుగైన ఫీల్డింగ్ చేసేందుకు ప్రాక్టీస్‌లో ప్లేయర్లు చెమటోడ్చారు. అటు SLకు కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్ ప్రధాన బలం. మిడిలార్డర్ రాణించాల్సి ఉంది. మంచు పడే ఛాన్స్ ఉండటంతో టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవచ్చు. 7PMకు మ్యాచ్ స్టార్ట్ కానుంది.
News December 23, 2025
పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.
News December 23, 2025
‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. 26న గ్రామ సభలు

AP: ఉపాధి హామీ చట్టం(MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా <<18633224>>VB-G RAM G<<>> చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కొత్త చట్టం గురించి రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి అధికారులకు కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. ఏడాదికి 125 పనిదినాలున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.


