News March 26, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 252 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి ఫిజిక్స్ పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 227 మంది, ప్రైవేట్ విద్యార్థులు 25 మంది గైర్హాజరు అయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగినట్లు చెప్పారు.

Similar News

News April 1, 2025

మేడ్చల్: మొదటి దశలో 308 ఇందిరమ్మ ఇళ్లు !

image

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,43,267 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సర్వే చేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా కేవలం 8,475 మందికి మాత్రమే సొంత ఇంటి నిర్మాణానికి స్థలాలున్నట్టు గుర్తించారు. అందులో కూడా నిరుపేదలను గుర్తించి 308 ఇళ్లను అధికారులు మొదటి ఫేజ్ కింద మంజూరు చేశారు.

News April 1, 2025

నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

News April 1, 2025

అలంపూర్: ‘నిర్లక్ష్యానికి నిదర్శనం ప్రభుత్వ వైద్యశాల’

image

అలంపూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో కనీస రోగులకు అందించే మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. అలంపూర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన పలువురు కుక్క కాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వైద్యశాలకు వెళితే కుక్కకాటుకు మందు వైద్యశాలలో లేదని పక్క రాష్ట్రమైన కర్నూల్‌కి వెళ్లాలని వైద్యులు సూచించారని రోగులు ఆరోపిస్తున్నారు. కనీసం మందులు లేకుంటే ఎట్లా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?

error: Content is protected !!