News March 25, 2024
శ్రీ సత్యసాయి: పసికందుకు ఓకే రోజు 3 వ్యాక్సిన్‌లు.. మృతి
రొళ్ల మండలం దొడ్డేరి పంచాయతీలో ANM, వైద్యుల నిర్లక్ష్యం పసికందు(నెల)ను బలి తీసుకుంది. పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లు గ్రామానికి చెందిన రాధమ్మ, దొడ్డ హనుమ దంపతులకు జన్మించిన పసికందుకు ANM వరలక్ష్మి ఈనెల 23న 3 వ్యాక్సిన్‌లు వేశారు. అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున పసికందు మరణించింది. తమ బిడ్డ మరణానికి ANM, వైద్యులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
Similar News
News November 17, 2024
మద్యం మత్తులో కిందపడి యువకుడి మృతి
గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ సాకేత్ అనే యువకుడు మద్యం మత్తులో జారి రోడ్డుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ సాకేత్ కొత్తపేట సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో స్టోర్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. అతిగా మద్యం తాగి జారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 17, 2024
అనంత: బీజేపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడి
బొమ్మనహాల్ మండలం చంద్రగిరికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిపై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు వేట కొడవలితో దాడి చేసి నరికారు. దాడిలో కృష్ణమూర్తి శెట్టి తల, వీపు, చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బళ్లారి ఆసుపత్రికి తరలించారు. భూ తగాదా వల్లే దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 17, 2024
అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్
అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఇఓ, డివిఈవో, ఆయా కళాశాల ప్రిన్సిపల్, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అపార్ జనరేషన్ జరిగిన చర్యలు తీసుకోవాలన్నారు.