News April 22, 2024

శ్రీకాకుళం: 28,982 మంది విద్యార్థుల ఎదురుచూపులు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇటీవల మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28,982 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 1592 మంది పరీక్షలు రాశారు.. విద్యార్థుల్లో బాలురు 14,843 మంది ఉండగా, బాలికలు 14,139 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 145 పరీక్షా కేంద్రాలో పది పరీక్షలు నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Similar News

News September 30, 2024

SKLM: ఈసీసీఈ డిప్లొమా కోర్సుల ప్రవేశాల దరఖాస్తుకు నేడే లాస్ట్

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లొమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లో దరఖాస్తు సోమవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు www.brau.edu.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, రూ.250 ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు కోసం విద్యా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.

News September 30, 2024

జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి

image

జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.