News July 5, 2024

శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు

image

అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Similar News

News October 6, 2024

దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

News October 6, 2024

అంపైర్‌గా సిక్కోలు వాసి

image

విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అంపైర్‌గా ఉద్దానం ప్రాంతానికి చెందిన తుంగాన శరత్‌కు అవకాశం వచ్చింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి శరత్‌కు ఉత్తర్వులు అందాయి. ఆయనను పలువురు అభినందించారు.

News October 6, 2024

SKLM: నేటి నుంచి IIITకి సెలవులు

image

ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.