News March 25, 2025

శ్రీకాకుళం: అనుమానంతోనే హత్యలు

image

నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ తూ.గో జిల్లా హుకుంపేటలో ఆదివారం తల్లి కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె ఫోన్‌లో మరొకరితో చాటింగ్ చేయడాన్ని చూసి సహించని శివకుమార్.. పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.

Similar News

News March 28, 2025

SKLM: జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

image

శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 28, 2025

SKLM: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

పలాస, శ్రీకాకుళం మీదుగా హైదరాబాద్(HYB)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07165 HYB- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News March 28, 2025

శ్రీకాకుళం: బాలల హక్కుల కార్యదర్శి నియామకం

image

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్‌లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.

error: Content is protected !!