News June 24, 2024

శ్రీకాకుళం: ఆకాశాన్ని తాకుతున్న టమాట ధరలు

image

జిల్లాలో టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రైతు బజార్లో టమాటా ధర కిలో70 రూపాయలు, బహిరంగ మార్కెట్లో ఏకంగా 100 రూపాయలు పలుకుతుందని ప్రజలు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్‌లో టమాటా నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News October 6, 2024

SKLM: నేటి నుంచి IIITకి సెలవులు

image

ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 6, 2024

‘బంగారువలస-వైజాగ్ బస్సును పునరుద్ధరించండి’

image

వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 5, 2024

SKLM: ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.