News April 11, 2024
శ్రీకాకుళం: ఆరో తరగతిలో ప్రవేశాలకు 21న అర్హత పరీక్ష
2024-25 ఏడాదికి గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
Similar News
News November 24, 2024
శ్రీకాకుళం: హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు-కలెక్టర్
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.
News November 24, 2024
ఆడలి ఘాట్ వద్ద ప్రమాదం.. మహిళ మృతి
సీతంపేట మండలం ఆడలి వ్యూ పాయింట్ సందర్శించి తిరిగి వస్తున్న కుటుంబం వేలం గూడ ఘాట్ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. గాయాలైన వ్యక్తిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని సీతంపేట ఎస్ఐ అమ్మనరావు దర్యాప్తు చేపడుతున్నారు.
News November 24, 2024
IPL వేలంలో మన శ్రీకాకుళం కుర్రాడు.!
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన శ్రీకాకుళం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.