News April 12, 2025
శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులారా.. GET READY

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 14, 2025
SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు రేపు రద్దు

శ్రీకాకుళంలోని జడ్పీ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రేపు సోమవారం నిర్వహించడం లేదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేశామని చెప్పారు. ప్రజలంతా గమనించాలని కోరారు.
News April 13, 2025
బూర్జ: రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన విద్యార్థిని

బూర్జ మండలం ఓవిపేట మోడల్ స్కూల్‌లోఎంపీసీ గ్రూపు సెకండ్ ఇయర్ చదువుతున్న కె.ధరణి శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. 1000కి 984 మార్కులు రావడంతో ఇంటర్మీడియట్ కార్యదర్శి విద్యార్థినిని సైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును 15న సీఎం చేతులు మీదుగా విజయవాడలో అందుకుంటారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
News April 13, 2025
SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.2,67,800/- లు,పూజలు, విరాళాల రూపంలో రూ.78,417/-లు, ప్రసాదాల రూపంలో రూ.1,76,405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.