News December 3, 2024

శ్రీకాకుళం: ఈ నెల 9 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం

image

శ్రీకాకుళంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముసాయిదా ఓటర్లు డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించినన్నారు. అనంతరం మార్పులు, చేర్పులకు ఈనెల 9వ తేదీన www.coeandhra.nic.in వెబ్‌సైట్‌లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని సంప్రదించి దరఖాస్తులను సమర్పించవచ్చు.

Similar News

News December 27, 2024

శ్రీకాకుళం: మండల అధికారులతో జేసీ సమీక్షా

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 26, 2024

శ్రీకాకుళం: ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షా 

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ డివిజన్ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

News December 26, 2024

శ్రీకాకుళం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షురాలిగా పూర్ణిమ

image

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం జిల్లా, సర్వసభ్య సమావేశం పట్టణంలోని గూనపాలెంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గ ఎంపికలు ఎన్నికల అధికారి శివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన జిల్లా సంఘ అధ్యక్షురాలుగా ఎస్ వి ఎస్ఎల్ పూర్ణిమ, సెక్రటరీగా కె. జగన్ మోహన్ రావు , ట్రెజరర్ గా కె. మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.