News July 6, 2024

శ్రీకాకుళం: ఒక్కొక్కరిగా ఆస్పత్రిపాలవుతున్న విద్యార్థులు

image

కోటబొమ్మాలి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గత 2రోజులుగా ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి వరకు పాఠశాలలో చదువుతున్న 20మంది విద్యార్థులకు తీవ్రంగా వాంతులు, విరేచనాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 7, 2024

SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ

image

జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

News October 7, 2024

పలాస: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

image

వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన రామకృష్ణాపురంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని అన్నారు. క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు

image

శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.