News May 14, 2024

శ్రీకాకుళం: ఓటు కోసం వేరే దేశం నుంచి వచ్చినా..? 

image

సంతబొమ్మాళి మండలం యామాలపేటకు చెందిన లొట్ల రాము ఓటు వేయడానికి  ఒమన్ దేశం నుంచి రూ.40 వేలు ఖర్చు పెట్టి గ్రామానికి వచ్చారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంకు వెళ్ళగా ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓటరు జాబితాలో ఆయన పేరు లేదంటూ అధికారులు వెనక్కి పంపారు. తన ప్రమేయం లేకుండా ఎలా ఓటు తొలగించారంటూ ఆ యువకుడు మండిపడ్డాడు. 

Similar News

News November 26, 2024

త్రిపురాన విజయ్ నేపథ్యం ఇదే..!

image

శ్రీకాకుళం జిల్లా యువకుడు IPLకు ఎంపికైన విషయం తెలిసిందే. టెక్కలికి చెందిన త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్య దంపతుల కుమారుడు విజయ్‌కు మొదటి నుంచి క్రికెట్ ఆసక్తి. ఈక్రమంలో పలు పోటీల్లో సత్తాచాటాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30లక్షల బేస్ ప్రెస్‌‌కు దక్కించుకుంది. విజయ్ తండ్రి వెంకటకృష్ణరాజు సమాచారశాఖ ఉద్యోగి, తల్లి లావణ్య గృహిణి. విజయ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

News November 26, 2024

మందస: ముగిసిన యుటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు

image

సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

News November 25, 2024

SKLM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఆ గడువు 25వ తేదీతో ముగుస్తుంది. రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు, రూ.1500 అపరాధ రుసుముతో ఈనెల 28 వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.