News June 4, 2024
శ్రీకాకుళం: ‘కింజరాపు కుటుంబంలో అందరూ గెలిచారు’
కింజరాపు కుటుంబం నుండి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు నాయకులు గెలుపొందారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ, అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2019లో సైతం అచ్చెన్న, రామ్మోహన్‌తో పాటు రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుండి టీడీపీ తరపున గెలిచారు.
Similar News
News November 27, 2024
శ్రీకాకుళంలో మొదలైన చలి
శ్రీకాకుళంలోని చలి విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల సమయం అయినా చలి తీవ్రత తగ్గడం లేదు. శ్రీకాకుళంలోని పలు పల్లె ప్రాంతాల్లో పొగ మంచం అలుముకుంది. ఈ క్రమంలో జిల్లాలోని రాత్రి సమయాల్లో 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుంది. డిసెంబర్ నెల దగ్గర కావస్తుండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిణుపులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 27, 2024
SKLM: పొందూరు సింహాచలంపై ACB సోదాలు
ఏసీబీ అధికారులకు మరో భారీ చేప చిక్కింది. VSKPలోని GVMC జోన్-2. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సింహాచలం, బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఇంటి స్థలాలు, 4.60 హె. భూమి, లక్షల విలువ గల కారు, బంగారు ఆభరణాలతో పాటుగా బ్యాంక్ ఖాతాలో నగదు ACB గుర్తించింది. కేసు నమోదు చేసిన ACB దర్యాప్తు చేస్తోంది.
News November 27, 2024
మందస: బుడంబో గ్రామ సమీపంలో పులి కలకలం
మందస మండలం, సాబకోట పంచాయితీ, బుడంబో గ్రామ సమీపాన పులి సంచరిస్తున్నట్లు మంగళవారం కలకలం రేగింది. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై మందస వెళ్లి తిరిగి సాబకోట వెళ్తుండగా చిన్న బరంపురం నుంచి బుడంబో వెళ్లే తారు రోడ్డులో పులి రోడ్డు దాటుతుండగా చూసినట్లు మదన్మోహన్ బెహరా అనే వ్యక్తి సాబకోట సచివాలయానికి వెళ్లి సమాచారం అందజేశారు. సచివాలయ సిబ్బంది పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.