News September 25, 2024
శ్రీకాకుళం ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1727270057419-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లి హైస్కూల్లో జరిగిన ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి విద్యార్థి కృష్ణంరాజు మృతి, మరో విద్యార్థి గాయపడటం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పాఠశాలల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News February 16, 2025
జలుమూరు: మూడు రోజులపాటు రైల్వే గేటు మూసివేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739677450116_51456737-normal-WIFI.webp)
జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు ఈ నెల 17, 18, 20 తేదీల్లో మూసి వేస్తున్నట్లు రైల్వే సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలాస నుంచి శ్రీకాకుళం వరకు రైలు మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ దారిలో ప్రయాణించే వాహనాలు మళ్లింపు చేస్తున్నామని ప్రయాణికులు సహకరించాలని కోరారు.
News February 16, 2025
టెక్కలి: యువకుడి బ్రెయిన్‌డెడ్.. అవయవదానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739672456549_1128-normal-WIFI.webp)
టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామానికి చెందిన మామిడిపల్లి సతీష్ (24) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు.. శనివారం యువకుడి నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.
News February 16, 2025
శ్రీకాకుళంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739631949482_71674880-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.