News April 21, 2024

శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు భీపామ్‌లు అందించిన చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థులకు భీపామ్‌లు అందించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ (శ్రీకాకుళం), గౌతు శీరిష (పలాస), బెందాళం అశోక్(ఇచ్ఛాపురం), కూన రవికుమార్(ఆమదాలవలస), అచ్చెన్నాయుడు (టెక్కలి), మామిడి గోవిందరావు(పాతపట్నం), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట) భీపామ్‌లు అందుకున్నారు.

Similar News

News April 21, 2025

అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం 

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

News April 21, 2025

కంచిలిలో వ్యవసాయ పరికరాలు పంపిణీ 

image

కంచిలి మండలంలో సబ్ మిషన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బెందాళం అశోక్,  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్  అందజేశారు. అనంతరం ఈ పథకం కింద నిర్మించిన వ్యవసాయ గోడౌన్‌ను ప్రారంభించారు. ఈ ఆధునిక పరికరాలు రైతుల వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. 

News April 20, 2025

వివాహిత హత్య.. నిందితుడి కోసం గాలింపు

image

రణస్థలంలోని పైడిభీమవరంలో నడిరోడ్డుపై శనివారం వివాహిత భవాని దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి చాకుతో ఆమె గొంతుకోసి సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగి పడేసి వెళ్లాడు. మృతురాలు పని చేస్తున్న హోటల్‌లోని వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవానీ స్వగ్రామం విజయనగరం(D) పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరంలోని వెంకట సత్యంతో ఈమెకు వివాహమైంది.

error: Content is protected !!