News October 17, 2024
శ్రీకాకుళం: ‘జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు’

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు నిక్షిప్తమైన సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి, జిల్లాలోని నిర్మానుష్యమైన ప్రదేశాలలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని సీసీ కెమెరాలు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Similar News
News December 13, 2025
SKLM: ‘సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతల్లేకుండా చేయాలి’

సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌తో కలిసి ఆయన ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని అన్నారు.
News December 13, 2025
SKLM జిల్లాలో 6,508 కేసులు పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6,508 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా శనివారం పేర్కొన్నారు. దీనిలో సివిల్ కేసులు 202కు రూ.4,54,96,124లు, క్రిమినల్ కేసులు 625కు రూ.52,54,522లు, ఫ్రీ లిటిగేషన్ కేసులు 53కు రూ.20,38,931లతో రాజీ అయ్యాయని వెల్లడించారు. HMPO కేసులలో భార్యాభర్త కలుసుకోవడంతో న్యాయమూర్తులు ఆనందం వ్యక్తం చేశారన్నారు.
News December 13, 2025
15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


