News December 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో చలి పంజా ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. చలిగాలుల ఉద్ధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు. గ్రామాల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకొని కాచుకుంటున్నారు. ఎండ వచ్చి చలి తీవ్రత తగ్గాకే పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతకు సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News December 27, 2024

ఎచ్చెర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్లో అసోసియేట్ టీచర్ గనగళ్ల నీరజ(22) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గార మండలం కళింగపట్నం పంచాయతీ నగరాలపేటకు చెందిన నీరజ గడిచిన 6 నెలల నుంచి ఇదే స్కూల్ లో పనిచేస్తుంది. నీరజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News December 27, 2024

శ్రీకాకుళం: మండల అధికారులతో జేసీ సమీక్షా

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 26, 2024

శ్రీకాకుళం: ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షా 

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ డివిజన్ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.