News May 23, 2024
శ్రీకాకుళం: తలనొప్పి తట్టుకోలేక వివాహిత సూసైడ్

ఇచ్చాపురం మండలం డోంకూరులో బుధవారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ఉష(30) కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుంది. బుధవారం తీవ్రమైన తలనొప్పి రాగా, భరించలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుపల్లి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు నందన(10), రిత్విక్(5) సంతానం.
Similar News
News December 31, 2025
SKLM: జనవరి 28 వరకే ఛాన్స్

ఫింఛన్‌దారుల జీవన ప్రమాణ ధ్రువీకరణపత్రాలు వచ్చే నెల 28లోపు అందజేయాలని ఖజానా శాఖ ఉపసంచాలకుడు CH రవి కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు, కుటుంబ పింఛన్ దారులు వారి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పెన్షన్లు లైవ్‌లో ఉంటాయన్నారు. జనవరి 1 నుంచి 28తేదీ లోపు సంబంధిత ధ్రువపత్రాలు CFMSలో వ్యక్తిగత లాగిన్‌లో అప్లోడ్ చేయాలని, కార్యాలయానికి అందజేయాలన్నారు.
News December 31, 2025
SKLM: జనవరి 2 నుంచి కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి వీటిని అందజేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 652 గ్రామాల్లో మొత్తం 2,54,218 పుస్తకాలను పంపిణీ చేయనున్నారని స్పష్టం చేశారు.
News December 31, 2025
ఎచ్చెర్ల: అంబెడ్కర్ యూనివర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

రానున్న నూతన సంవత్సరం వర్శిటీ వర్గాలకు, అనుబంధ కళాశాలలకు, ఉన్నత విద్యారంగానికి మరింత శుభ సూచికంగా ఉంటూ ప్రగతి ఫలాలు అందించాలని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసి రజని అన్నారు. 2026 నూతన సంవత్సరానికి సంబంధించి డా.బీఆర్ఏయూ ముద్రించిన క్యాలండర్, డైరీలను తన ఛాంబర్‌లో మంగళవారం వర్శిటీ ఉన్నతాధికారులతో కలసి వీసీ ఆవిష్కరించారు. క్యాలెండర్ లో పొందుపరిచిన అంశాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు.


