News December 20, 2024

శ్రీకాకుళం: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97055 22122కు వాట్సాప్ చేయండి.

Similar News

News December 22, 2024

SKLM: చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

image

కవిటి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణాల్లో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ.7,76,958 మొత్తం విలువ గల ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

News December 22, 2024

కత్తులతో బెదిరించి చోరీకి యత్నం

image

శ్రీకాకుళం కిన్నెర కాంప్లెక్స్ వద్ద కాకి వీధిలోని గోవింద్ ఇంటిలో శనివారం రాత్రి దొంగలు కత్తులతో హల్చల్ చేశారు. ఇంట్లోని బాలుడు, ఓ మహిళ కూరగాయల కత్తితో  ప్రతిఘటించారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇంటి సభ్యుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. DSP వివేకానంద, సీఐ పైడిపు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 22, 2024

హరిపురం: రైలు పట్టాలపై ..మహిళ మృతదేహం

image

మందస మండలం హరిపురం సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైందని కాశీబుగ్గ జీఆర్పీ ఎస్‌ఐ ఎస్‌కె షరీఫ్ తెలిపారు. మృతురాలి వయస్సు 55 ఉంటుందని, బిస్కెట్ కలర్ జాకెట్, చింత పిక్క రంగు చీర కట్టుకుని ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.