News October 30, 2024

శ్రీకాకుళంలో అత్యధికంగా మహిళా ఓటర్లు

image

ముసాయిదా ఓటరు జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శ్రీకాకుళం ఉంది. నియోజకవర్గం మొత్తం 2,73,364 మంది ఓటర్ల ఉండగా అందులో 1,38,020 మంది మహిళా ఓటర్ల ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను నియమించారు.

Similar News

News October 30, 2024

పలాస: మాజీ మంత్రి అప్పలరాజుకు అస్వస్థత

image

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ఉదయం పలాసలోని నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని మెడికవర్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అప్పలరాజు చికిత్స పొందుతున్నారు. మంగళవారం నివాసంలో కింద పడడంతో గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీదిరి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు

News October 30, 2024

బూర్జ: బాలికకు వేధింపులు.. పోక్సో కేసు నమోదు

image

విజయవాడలో చదువుకుంటున్న బూర్జ మండలం సుంకరపేటకు చెందిన విద్యార్థినికి వేధింపుల విషయంలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. 9వ తరగతి విద్యార్థిని(14)పై మేనమామ వరసైన సూరిబాబు మాయమాటలతో 2022లో అత్యాచారం చేయగా, పెద్దలు వివాహం చేశారు. రెండేళ్లు గడవకముందే అత్తమామలు, భర్త వేధించడంతో పోలీసులను ఆశ్రయించింది. బాలికకు పదహారేళ్లు కావడంతో విజయవాడ గుణదల పోలీసులు పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేశారు.

News October 30, 2024

శ్రీకాకుళం: ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డిప్యూటీ కలెక్టర్ల పోస్టింగ్‌లలో జిల్లాకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో పలాస రెవెన్యూ డివిజినల్ అధికారిగా వెంకటేశ్వర్లును నియమించిందన్నారు. కలెక్టరేట్ KRRC విభాగం అధిపతిగా పద్మావతిని నియమించారని తెలిపారు. లావణ్యను BRR వంశధార ప్రాజెక్టు భూ సేకరణధికారిగా నియమించారని ఆ ప్రకటనలో తెలిపారు.