News January 5, 2025

శ్రీకాకుళంలో జనవరి 7న జాబ్ మేళా

image

శ్రీకాకుళం బలగ ప్రభుత్వ డీఎల్ టీసీ/ ఐటీఐ కాలేజ్‌లో జనవరి 7న ఏపీ నైపుణ్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అధికారి యు. సాయికుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 75 పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER పూర్తిచేసిన 18-35 ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Similar News

News January 8, 2025

ఎచ్చెర్ల: బంగారం చోరీ.. ఆపై తనఖా.!

image

ఎచ్చెర్ల మండల పరిధిలో వివిధ చోరీలకు పాల్పడుతున్న అనుమానితుడిని పోలీసులు విచారించగా మొత్తం కక్కేశాడు. గత నెలలో కేశవరావుపేట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో బంగారం పోయింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు నెలల క్రితం ఫరీదుపేటలో ఓ మహిళ ఇంట్లో బంగారం చోరీకి గురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫైనాన్స్‌లో బంగారం తనఖా పెట్టినట్లు చెప్పాడు.

News January 8, 2025

విశాఖలో ప్రధాని సభ.. ఫుడ్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు

image

విశాఖలో ప్రధాని మోదీ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనున్నారు. GVMC పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస చెక్‌పోస్టు వద్ద ఆహారం అందిస్తారు.

News January 8, 2025

కంచిలి: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య

image

కంచిలి మండలానికి చెందిన అంకుల శణ్ముఖరావు(51) అనే వ్యక్తిని తన భార్య మంగళవారం వేకువజామున హత్యచేసింది. సుమారు ఆరు నెలలుగా దంపతులు ఇద్దరు రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూలిపనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇరువురు మద్యం మత్తులో గొడవపడటంతో భర్తపై ఉమాపతి తీవ్రంగా దాడిచేయడంతో ఆయన మృతిచెందాడు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.