News April 14, 2024
శ్రీకాకుళంలో తీవ్ర వడగాల్పులు

రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 151 మండలాల్లో మోస్తరుగా.. 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. రేపు 135 మండలాల్లో స్వల్పంగా.. 33 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళంలో వడగాల్పులు ఉండనున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించింది.
Similar News
News April 23, 2025
SKLM: క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన DIG

విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల జిల్లాల ఎస్పీలతో DIG గోపినాథ్ జెట్టి క్రైమ్ రివ్యూ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై నియంత్రణ కోసం చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు.
News April 22, 2025
శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.
News April 22, 2025
సివిల్ సర్వీసులో మెరిసిన చిక్కోల్ యువకుడు

కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన లింగుడు జోష్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి, తల్లి రాజ్యలక్ష్మి. దీంతో జోష్‌ను పలువురు అభినందించారు.