News February 28, 2025
శ్రీకాకుళంలో మార్చి 3న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వై పోలినాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ఈ మేళాలో 12 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
Similar News
News February 28, 2025
శ్రీకాకుళం: నాగావళి వంతెన కింద వ్యక్తి మృతదేహం

నాగావళి నది వంతెన కింద వ్యక్తి మృతదేహన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. స్థానికుల కథనం.. శ్రీకాకుళం మండలం తోట పాలెం జంక్షన్ వద్ద ఉన్న నీలమ్మ కాలనీకి చెందిన యాదవ రెడ్డి రాజు (40) గా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
శ్రీకాకుళం: కళ్లు తిరిగి రోడ్డుపై పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం నగరంలోని పందుంపుళ్ల జంక్షన్లో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్సై హరిక్రిష్ణ తెలిపిన వివరాల మేరకు.. విశాఖకి చెందిన ఎం. కోదండరావు (35) శ్రీకాకుళంలోని ఓ పండ్ల షాపులో పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షాపులో పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డుపై పడి మృతి చెందాడు.
News February 28, 2025
సోంపేట: భర్త చితికి భార్య దహన సంస్కారాలు

సోంపేట మండలం హుకుంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దింటి జానకి రావు గురువారం గుండెపోటుతో మరణించారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. భర్త చితికి భార్య దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.