News May 27, 2024

శ్రీకాకుళంలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్

image

శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు సోమవారం పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరూ కూడా ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించరాదని సూచించారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News October 2, 2024

ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం

image

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్‌కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.

News October 2, 2024

స్వర్ణాంధ్ర విజన్‌లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మాట్లాడారు.

News October 1, 2024

శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఉదయం నుంచి సేల్స్ మాన్‌లు, సూపర్వైజర్‌లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్‌లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.