News April 5, 2025

శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

image

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News April 7, 2025

యాక్షన్ థ్రిల్లర్‌గా ‘స్పిరిట్’!

image

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మెక్సికోలో స్టార్ట్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ‘స్పిరిట్ సినిమా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే ప్రాజెక్టు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇది సాలిడ్ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ టైప్ సినిమా అని తెలియడంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.

News April 7, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. నష్టాల్లో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు

image

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్‌ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు జపాన్ కంపెనీ సోనీ షేర్లు ఏకంగా 10% పతనమయ్యాయి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్‌ను చాలా దేశాలు వ్యతిరేకించాయి. సుంకాల తగ్గింపుపై అగ్రరాజ్యంతో పలు దేశాలు చర్చలకు దిగాయి.

News April 7, 2025

SRH ఘోర ఓటమి.. కారణాలివే!

image

బ్యాటర్లు పిచ్‌తో సంబంధం లేకుండా దూకుడునే నమ్ముకుని బోల్తా కొడుతున్నారు. గతంలో భువనేశ్వర్, నటరాజన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసేవారు. ఇప్పుడు షమీ తన స్థాయిలో రాణించట్లేదు. కమిన్స్ భారీగా పరుగులిస్తున్నారు. వికెట్ టేకింగ్ స్పిన్నర్లు లేరు. జంపా, రాహుల్ చాహర్ లాంటి మంచి స్పిన్నర్లు ఉన్నా జట్టులోకి తీసుకోకపోవడం దెబ్బ కొడుతోంది. ముఖ్యంగా 300 లోడింగ్ అనే అంచనాలు మొదటికే మోసం తెస్తున్నాయి.

error: Content is protected !!