News April 2, 2025

శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని ఎస్పీకి ఆహ్వానం

image

నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో ఈ నెల 6న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ నర్సింహాను ఆలయ ధర్మకర్త కొల్లు క్షత్రయ, నడిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులుఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మ కర్త మాట్లాడుతూ.. శ్రీరామ నవమి ఆహ్వానంపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Similar News

News April 4, 2025

రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు!

image

TG: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 రోజుల్లో దాదాపు 41వేల టన్నులకు పైగా బియ్యాన్ని సరఫరా చేసినట్లు సమాచారం. సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపులకు జనం భారీగా వస్తున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీరు బియ్యం తెచ్చుకున్నారా? క్వాలిటీ ఎలా ఉంది?

News April 4, 2025

యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

News April 4, 2025

నరసన్నపేట: లారీ యాక్సిడెంట్.. తాపీమేస్త్రి మృతి

image

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ తాపీమేస్త్రి మృతి చెందారు. నరసన్నపేట మండలం పొలాకి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు(49) మధురవాడలో మరో వ్యక్తితో పని నిమిత్తం బైక్‌పై బయలుదేరారు. మారికవలస హైవేపై ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ప్రభాకర్ రావు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

error: Content is protected !!