News April 8, 2024
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం సిద్ధం

భద్రాచలంలో ఈనెల 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉగాది రోజున శాస్త్రోక్తాoగా అంకురార్పణ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పనులన్నీ పూర్తి కాగా ఆదివారం రాత్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కాగా మంగళవారం నుంచి ఈనెల 23 వరకు స్వామివారి నిత్య కళ్యాణం, పవళింపు సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు.
Similar News
News December 14, 2025
ఖమ్మం జిల్లాలో ‘కిక్’ ఎక్కిస్తోన్న జీపీ ఎన్నికలు..!

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం మధ్య, గత 13 రోజుల్లో వైరా డిపో నుంచి రూ. 130 కోట్ల విలువైన 1.59 లక్షల కేసుల మద్యం, 56 వేల కేసుల బీర్లు తరలించారు. ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అటు వ్యాపారులకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
News December 13, 2025
ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.
News December 13, 2025
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. కామేపల్లిలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సామగ్రి పంపిణీ, ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, MRO సుధాకర్ పాల్గొన్నారు.


