News April 5, 2025

శ్రీరామనవమి వేడుకలు.. చిత్తూరు SP సూచనలు 

image

చిత్తూరు జిల్లా ప్రజలకు SP మణికంఠ చందోలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని చైత్రశుద్ధ నవమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలనే సందేశం ఇస్తుందని SP అన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు వేడుకలు చేసుకోవాలని ఆయన సూచించారు. 

Similar News

News April 6, 2025

సీతారాముడికి చిత్తూరు ఎస్పీ పూజలు 

image

చిత్తూరు నగరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎస్పీ మణికంఠ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 6, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.184లు ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ కిలో రూ.210గా ఉంది. లేయర్ మాంసం కిలో రూ.178లకు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800 నుంచి 900 వరకు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతాలలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 5, 2025

గ్రూప్ -2 కు ఎంపికైన చౌడేపల్లి కానిస్టేబుల్

image

గ్రూప్-2 పరీక్షలలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆదినారాయణ ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొంటూ.. అటు గ్రూప్‌-2లో ప్రతిభ చూపాడు. ఆయనను సీఐ రాంభూపాల్, ఎస్సై నాగేశ్వరరావుతో పాటు సహచర సిబ్బంది అభినందించారు. 

error: Content is protected !!