News April 5, 2025
శ్రీరామనవమి వేళ.. వరంగల్ ట్రైసీటీలో పోలీసుల నజర్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శ్రీరామ మందిరాలతోపాటు, వాడల్లో ప్రజలు జరుపుకునే శ్రీరాముని కళ్యాణ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. రామ మందిరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభాయాత్ర సమయంలో పోలీసులు తగు బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News April 6, 2025
7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

భీమవరంలోని కలెక్టరేట్‌లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.
News April 6, 2025
నంద్యాల: మెగా జాబ్ మేళా

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్కొంటారని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.