News April 6, 2025

శ్రీరామనవమికి సంగారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. మత సంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మతసామరస్యం నెలకొంటుందని తెలిపారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో శ్రీరామనవమి ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.

Similar News

News April 9, 2025

IPL: చెన్నైకు మరో ఓటమి

image

CSKతో మ్యాచులో 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. ఈ సీజన్‌లో PBKSకు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.

News April 9, 2025

హైదరాబాద్‌కు BYD రానట్లే..!

image

హైదరాబాద్‌కు చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD రాబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కేంద్రమంత్రి వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలతో ఆ కంపెనీ వచ్చేందుకు అవకాశాల్లేవని స్పష్టమైంది. ప్రస్తుతానికి BYDకి డోర్లు తెరవబోమని ఆయన తేల్చి చెప్పారు. దేశ వ్యూహాత్మక, సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను ఆహ్వానించాల్సి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

News April 9, 2025

ఎన్టీఆర్: పీ4 సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

ఎన్టీఆర్: పీ4 అమలుపై సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ విధానాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘మార్గదర్శి’లను గుర్తించాలన్నారు. ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా స్టేట్ లెవెల్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

error: Content is protected !!