News February 23, 2025
శ్రీశైల మల్లన్నకు అమరచింత పట్టు వస్త్రాలు

శ్రీశైల మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. పద్మశాలి వంశస్థులు భాగస్వాములై ఏటా పట్టు వస్త్రాలను నేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మల్లన్న సన్నిధిలో ప్రియమైన నిష్ఠలతో పట్టు వస్త్రాలను తయారు చేసి బ్రహ్మోత్సవాల రోజు స్వామివారికి సమర్పించనున్నట్లు అధ్యక్షులు మహంకాళి విష్ణు తెలిపారు.
Similar News
News February 23, 2025
మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 23, 2025
6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.
News February 23, 2025
రేపు ఉ.10 గంటలకు..

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.