News March 16, 2025

శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారా: భూమన 

image

కడపలోని కాశీనాయన క్షేత్రాన్ని కూల్చడం దారుణమని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టైగర్ జోన్ కావడంతో కూల్చామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై CM నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌పై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. ‘పవనా నంద స్వామి.. దీనిపై తమరు ఎందుకు మాట్లాడటం లేదు’ అని ప్రశ్నించారు.  

Similar News

News March 16, 2025

ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

image

★ రేపటి నుంచి పది పరీక్షలు ప్రారంభం 
★ జిల్లాలో పరీక్ష రాయనున్న 31,231 మంది విద్యార్థులు 
★విజయవాడలో కోడి పందేలపై దాడి.. ఏడుగురు అరెస్ట్
★ జిల్లాలో ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి 
★ విజయవాడలో సందడి చేసిన రాబిన్‌హుడ్ చిత్ర బృందం 
★ IBM ఫెర్రీలో గుర్తుతెలియని మృతదేహం గుర్తింపు 
★ జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ 
★ జిల్లాలో హడలెత్తిస్తున్న ఎండలు

News March 16, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

★ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ 
★ కోనేరు సెంటర్‌ను ఐకానిక్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: కొల్లు 
★ కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు 
★ కృష్ణా జిల్లాలో భానుడి భగభగలు 
★ గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ నుంచి విజయవాడ వెళ్లిన హీరో నితిన్
★ మచిలీపట్నంలో పేర్ని నానిని కలిసిన వైసీపీ నేతలు 
★ గన్నవరంలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

News March 16, 2025

ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

image

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

error: Content is protected !!