News October 22, 2024

శ్రీశైలం మల్లన్న సేవలో సినీ నిర్మాత దిల్ రాజు

image

శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఆయన మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.

Similar News

News January 3, 2025

డాక్టర్లూ మీరు గ్రేట్ ❤

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మం. కలుగొట్ల గ్రామ ప్రజలకు ఆ ఊరికి చెందిన నలుగురు డాక్టర్లు ఉచిత వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్, జాన్ పాల్, మద్దమ్మ, కృష్ణ అనే వైద్యులు గురువారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, తదితర టెస్టులు చేసి ఫ్రీగా మందులు అందించారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత ఖర్చుతో వైద్య శిబిరం నిర్వహించామని వారు తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News January 3, 2025

కర్నూలు జిల్లాకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలు.!

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని నదులన్నింటినీ గోదావరి నుంచి బాణాకచర్లకు అనుసంధానిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News January 3, 2025

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు షేక్ ఆఫ్రిది

image

ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనబోయే ఏపీ జట్టుకు కర్నూలు క్రీడాకారుడు షేక్ అఫ్రీద్ ఎంపికయ్యాడు. ఈ మేరకు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు నీలిమ, కార్యదర్శి భానుప్రసాద్ తెలిపారు. షేక్ ఆఫ్రిది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచాడని పేర్కొన్నారు.