News January 24, 2025
శ్రీశైలంలో అంకాలమ్మ తల్లికి విశేష పూజలు

లోక కల్యాణార్థం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. సర్కారిసేవగా ఈ విశేష పూజలు జరిపించబడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మకు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలను నిర్వహించారు.
Similar News
News March 14, 2025
MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్‌లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్‌ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
News March 14, 2025
FLASH: కామారెడ్డి: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

కామరెడ్డి జిల్లాలోని హైవేపై టేక్రియాల్ గేట్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందాడని చెప్పారు. ఆటో వెనుక నుంచి వస్తున్న లారీ నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
హోలీ.. సీఎం రేవంత్ పాత ఫొటోలు

TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి ఆప్తమిత్రులతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. మరి పై ఫొటోల్లో సీఎం ఎక్కడ ఉన్నారో గుర్తు పట్టారా? కామెంట్ చేయండి.