News February 24, 2025

శ్రీశైలంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళ గంగ ఘాట్‌కు చేరుకొని అక్కడ ఏర్పాట్లను భక్తులను అడిగి తెలుసుకున్నారు. పాతాళ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News February 25, 2025

నాగర్ కర్నూల్ చెరువులో మహిళ మృతదేహం

image

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. చెరువులోని బతుకమ్మ ఘాట్ దగ్గర గుర్తుతెలియని మహిళా మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చెరువులోని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 25, 2025

నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్‌లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.

News February 25, 2025

వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

image

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

error: Content is protected !!