News April 13, 2025
శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక పాతాళ గంగలో స్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రద్దీ పెరిగింది.
Similar News
News April 20, 2025
BIG BREAKING: రేపే మెగా డీఎస్సీ

AP: నిరుద్యోగులకు మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రక ముందడుగని పేర్కొన్నారు. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
News April 20, 2025
పోలీసులపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం

AP: మాజీ ఎంపీ హర్షకుమార్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గతంలో ఎన్నడూ లేని విధంగా తనతో వ్యవహరించారని ఆరోపించారు. 5గంటలపాటు రాజమహేంద్రవరం అంతటా తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో హర్షకుమార్ రాజమహేంద్రవరంలో శాంతి ర్యాలీ తలపెట్టగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
News April 20, 2025
రేపు వర్షాలు

AP: ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు విజయనగరంలో 10, మన్యం జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.