News February 8, 2025
శ్రీశైలంలో మద్యం తాగుతూ పట్టుబడిన వైసీపీ నేత!

శ్రీశైలం దేవస్థానం పరిధిలో వైసీపీ నేత మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దేవస్థానం నిబంధనలు అతిక్రమించి ఆలయ ఉద్యోగితో కలిసి రజాక్ అనే వ్యక్తి మద్యం తాగుతున్నారు. రాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవదాయ చట్టం ఉల్లంఘన మేరకు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. రజాక్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా తెలుస్తోంది.
Similar News
News March 14, 2025
వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.
News March 14, 2025
అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.
News March 14, 2025
జలుమూరు: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

జలుమూరు మండలంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అబ్బాయిపేట గ్రామంలో ఎర్రన్నపేట గ్రామానికి చెందిన బలగ మణికంఠ ఓ వివాహ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్ల అలంకరణ చేపట్టాడు. ఈ క్రమంలో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం నరసన్నపేట తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించారు.