News April 25, 2025

షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

image

షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News April 25, 2025

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది: డానిష్ కనేరియా

image

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ‘టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం దారుణం. ఆయన వ్యాఖ్యలు నిజంగానే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ఎక్స్‌లో మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైనా డానిష్ దాయాది దేశాన్ని విమర్శించారు. అతడు ప్రస్తుతం USలో నివాసముంటున్నారు.

News April 25, 2025

చిత్తూరు: రోడ్ల మరమ్మతుకు నిధుల మంజూరు

image

రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్‌కు రూ.2.50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు(3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు(6 కిలోమీటర్లు)కు రూ.4.50 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.

News April 25, 2025

‘అమ్మా, నాన్నా.. నాకు బతకాలని లేదు’

image

అంటూ ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. TG జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట బాబు పుట్టడంతో ప్రసన్న ఉద్యోగం మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. ఈక్రమంలోనే ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

error: Content is protected !!