News April 7, 2025
సంక్షేమ వసతి గృహాలలో అంబేడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టరేట్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో జయంతి వేడుకలు ఏర్పాట్లకు సన్నాహాలు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 8, 2025
కృష్ణా: పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్

పెందుర్తిలో DCM పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయలేకపోయారని వైసీపీ నేత పోతిన మహేశ్ సోమవారం ట్వీట్ చేశారు. మాటలు, సూక్తులు చెప్పడం కాదని, ఆచరణలో చేసి చూపించాలని ఫైరయ్యారు. ఈ ఘటనకి బాధ్యత మీది కాదా? తప్పు చేసేది ఒకరు, శిక్షపడేది మరొకరికా? ఇదెక్కడి న్యాయం? అంటూ పవన్‌ను ప్రశ్నించారు.
News April 8, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం నాడు కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ.కేజీ)లో టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.21, బంగాళదుంపలు రూ.17, మిర్చి రూ.26, పికోడా మిర్చి రూ.60, క్యారెట్ రూ.36, మట్టి చామ రూ.28, చిలకడదుంపలు రూ.40, బద్ద చిక్కుడు రూ.62, మామిడి అల్లం రూ.55, కీరదోస రూ.24, కాలీఫ్లవర్ రూ. 20, బెండ రూ.28, బీరకాయలు రూ.42, వంకాయలు రూ.22/28 గా ధరలు నిర్ణయించారు.
News April 8, 2025
అంబేడ్కర్ కోనసీమ: నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేసినట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో అన్ని ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిపివేస్తున్నామన్నారు. దీనిపై ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.