News April 2, 2025
సంగారెడ్డి: LRS 25% రాయితీ గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం 25% రాయితీ గడువును ఈనెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ 25% రాయితీ గడువును ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 4, 2025
అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా?: రాజా సింగ్

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల BJP ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలు, అధిష్ఠానంపై మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు లేరా? అని ప్రశ్నించారు. అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డా.ఎన్.గౌతమ్ రావును MLC అభ్యర్థిగా BJP బరిలో నిలిపిన విషయం తెలిసిందే.
News April 4, 2025
సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్‌లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News April 4, 2025
పెద్దపల్లి: మట్టి మాఫియాపై చర్యలేవి?: గొట్టెముక్కుల

పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా పెరిగిపోయిందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టెముక్కుల సురేశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వస్తున్నా మౌనం పాటించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.