News March 20, 2025

సంగారెడ్డి: RYV పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని చెప్పారు. ఉపాధి పథకం ద్వారా రూ.4 లక్షల వరకు రుణం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 60 నుంచి 80% సబ్సిడీ ఉంటుందని వివరించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 20, 2025

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

News March 20, 2025

‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు.

News March 20, 2025

హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్

image

పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్‌లో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. వెంకటేష్ నిత్యం తాగి వచ్చి తల్లి లక్ష్మమ్మ, భార్య సబితను వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఈనెల 19న తల్లి, భార్య ఇద్దరు కలిసి ఐరన్ రాడ్‌తో అతడి చెవి భాగాన కొట్టి చంపారు. నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

error: Content is protected !!