News April 2, 2025
సంగారెడ్డి: ‘అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించాలి’

బడిబాట కార్యక్రమం మాదిరిగా అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత చంద్రన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెల 20న అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు చేయాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, కలెక్టర్ చంద్రశేఖర్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలితకుమారి పాల్గొన్నారు.
Similar News
News April 4, 2025
సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్‌లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News April 4, 2025
పెద్దపల్లి: మట్టి మాఫియాపై చర్యలేవి?: గొట్టెముక్కుల

పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా పెరిగిపోయిందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టెముక్కుల సురేశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వస్తున్నా మౌనం పాటించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News April 4, 2025
గజపతినగరం: చెట్టు పైనుంచి జారిపడి ఒకరి మృతి

గజపతినగరం మండలంలో తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన భోగాది సత్యం (50) కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు సత్యం భార్య భోగాది లక్ష్మి శుక్రవారం తెలిపారు. గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని లక్ష్మీ వాపోయారు.