News March 18, 2025

సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

image

నారాయణఖేడ్ నియోజకవర్గ భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగన్ పల్లికి చెందిన 22 ఏళ్ల పోగుల మహేశ్వరికి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించారు. సోమవారం ఉదయం మహేశ్వరి ఉరి వేసుకుని మరణించింది.

Similar News

News March 18, 2025

‘దమ్ముంటే పట్టుకోరా’.. ఇన్విజిలేటర్‌కు సవాల్

image

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్’ అనే రాతలు కనిపించాయి. దీన్ని చూసిన ఇన్విజిలేటర్లు మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పిచ్చిరాతలపై మీ COMMENT.

News March 18, 2025

WGL: తగ్గిన మొక్కజొన్న.. పెరిగిన పల్లికాయ!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర మళ్లీ తగ్గింది. గతవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. సోమవారం రూ.2,280కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గి రూ. 2270 కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.7,150 పలకగా నేడు రూ.7,390కి పెరిగింది. పచ్చి పల్లికాయ సోమవారం రూ.4,400 ధర రాగా ఈరోజు రూ.4,500కి పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

News March 18, 2025

సునీత.. మీరు భారత్ రావాలి: ప్రధాని మోదీ

image

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు PM మోదీ లేఖ రాశారు. తొలుత భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్నా ఎప్పుడూ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. తానెప్పుడు బైడెన్, ట్రంప్‌ను కలిసినా సునీత బాగోగుల గురించి అడిగినట్లు తెలిపారు. భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత భారత్‌ సందర్శనకు రావాలని కోరారు. తనకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తామని మోదీ తెలిపారు.

error: Content is protected !!